1. దానశీలం

కవి పరిచయం

(ఊహాచిత్రం) క్రీ.శ.15వ

 పోతన జనగామ జిల్లా బమ్మెర గ్రామ నివాసి. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతన

సహజపండితుడని ప్రసిద్ధి.

మానవమాత్రులైన రాజులకు తనగ్రంథాన్ని అంకితం చెయ్యనని, భగవంతుడిచ్చిన కవితాకళను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేశాడు.

శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత. ప్రహ్లాదచరిత్ర, గజేంద్రమోక్షం, రుక్మిణీ కల్యాణం మున్నగు ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగువాడికి కంఠతా వస్తాయి. పోతన రచనాశైలి, మధురభక్తి తరువాత కవులకు ఒరవడిగా నిల్చాయి. వీరభద్ర విజయం, భోగినీ దండకం,

నారాయణ శతకం ఇతని ఇతర రచనలు.