1. దానశీలం

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠ్యభాగం పురాణ ప్రక్రియకు చెందినది. పురాణం అంటే పాతదైననూ కొత్తగా భాసించేది. పురాణాలు18. వీటిని సంస్కృతంలో వ్యాసుడు రాశాడు. ఇందులో భాగవత పురాణం ఒకటి. భాగవతాన్ని పోతన తెలుగులోకి అనువదించాడు. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీమహాభాగవతం అష్టమ స్కంధంలోని ‘వామన చరిత్ర లోనిది.

ప్రశ్నలు:

1. దానశీలం పాఠం ఏ ప్రక్రియలో ఉంది? - పురాణం

2. భాగవతం రాసింది ఎవరు? - వ్యాసుడు

3. దానశీలం పాఠం ఎక్కడి నుండి స్వీకరించారు? - శ్రీమహాభాగవతం అష్టమస్కంధంలోని వామనచరిత్ర నుండి