1. దానశీలం

పాఠం నేపథ్యం / ఉద్దేశం

      విరోచనుని కుమారుడైన బలి అసుర చక్రవర్తి. ప్రహ్లాదుని మనుమడు. ఇతడు తన శక్తిసామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. ఇతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలినవారు వివక్షకు గురైనారు. ఈ విషయాన్ని వారు మహావిష్ణువుతో చెప్పుకోగా తాను వామనునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమిచ్చాడు.

      ఆ తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామనావతారం ఎత్తినాడు. బలి నర్మదానదీ తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్ళి తనకు మూడడుగుల నేల కావాలని కోరగా తాను ఇస్తానని బలి మాట యిచ్చాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించాడు. బలిచక్రవర్తిని దానం ఇవ్వవద్దని అన్నాడు.

      ఇచ్చిన మాటకు కట్టుబడే తత్త్వాన్ని, దానం చేయడంలోని గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.

ప్రశ్నలు:

1. బలిచక్రవర్తి తండ్రి ఎవరు? - విరోచనుడు.

2. స్వర్గలోకాన్ని ఆక్రమించింది ఎవరు? - బలిచక్రవర్తి

3. వామనుడిగా జన్మించింది ఎవరు? - మహావిష్ణువు

4. శుక్రాచార్యుడు ఎవరు? - రాక్షసుల గురువు

5. దానశీలము పాఠం ద్వారా విద్యార్థులు ఏం తెలుసుకుంటారు? - మాటకు కట్టువడటం, దానం చేయడంలో గొప్పదనం